గజవాహనంపై లక్ష్మీనరసింహుడు | - | Sakshi
Sakshi News home page

గజవాహనంపై లక్ష్మీనరసింహుడు

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

గజవాహ

గజవాహనంపై లక్ష్మీనరసింహుడు

గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గజవాహనంపై విహరించారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన శనివారం ఉదయాన్నే మూలవర్లకు తోమాలసేవ నిర్వహించారు. తిరుచ్చి వాహనంలో స్వామి వారిని కొలువు దీర్చి మేళ తాళాలు, సాంస్కృతి కార్యక్రమాలతో ఊరేగింపు వైభవంగా సాగింది. అంతకుముందు ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంకాలం స్వామి వారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారిని గజవాహనం పై కొలువుదీర్చి గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు కల్యాణోత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు గోపాలాబట్టర్‌ తెలిపారు. సాయంకాలం సర్వభూపాల వాహనం సేవ ఉంటుందన్నారు.అనంతరం గరుడవాహనంపై స్వామివారు విహరిస్తారు. కల్యాణోత్సవం రోజే తిరునాల నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పరిసర గ్రామాల నుంచి చాందినీ బండ్లు తరలివస్తాయి.

గజవాహనంపై లక్ష్మీనరసింహుడు 1
1/1

గజవాహనంపై లక్ష్మీనరసింహుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement