ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 1 2026 7:45 AM | Updated on Mar 1 2026 7:45 AM

ఉచిత

ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం గిరిధర్‌నాయక్‌కు జాతీయస్థాయి అవార్డు ప్రయాణికుల మన్ననలు పొందాలి విద్యార్థులకు శాసీ్త్రయ దృక్పథం అవసరం

బి.కొత్తకోట: విద్యాహక్కు చట్టం ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్‌, అన్‌న్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఒకటవ తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ నున్నా అనూరాధ శనివారం తెలిపారు. ఈ ఉచిత ప్రవేశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎంఈవోలను ఆదేశించామన్నారు. ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు సహాయంగా జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు.. వెల్ఫేర్‌, ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్ల సహకారంతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అనాథలు, ఎయిడ్స్‌ బాధితుల పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీలు, ఓసీ వర్గాలకు చెంది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల పిల్లలు మార్చి 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎం పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎం.గిరిధర్‌నాయక్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 16 సంవత్సరాలుగా ఎన్‌సీసీ ఆఫీసర్‌గా ఉత్తమ సేవలు అందించినందుకు ఢిల్లీలోని ఎన్‌సీసీ విభాగం డీజీ కమండేషన్‌ కార్డ్‌ అవార్డు విత్‌ బ్యాడ్జ్‌ను ప్రకటించారు. ఈ అవార్డును శనివారం చిత్తూరులోని 35 ఆంధ్ర ఎన్‌సీసీ బెటాలియన్‌ కార్యాలయంలో కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ ఎన్‌.వి.మోసిస్‌ ప్రశంసాపత్రం అందజేశారు. ఆయన్ను పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

మదనపల్లె సిటీ: ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల మన్ననలు పొందాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవో హోం నందు కడప జోన్‌ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బంది సంక్షేమం, జీఓలు లీడరల్‌షిప్‌ క్వాలిటీపై శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా డీపీటీఓ రాము జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆర్టీసీ అతి పెద్ద సంస్థ అన్నారు.ప్రతి రోజు ప్రయాణికులతో నిత్యం సంబంధాలు ఉంటాయన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తే సంస్థకు మరింత పేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.రమణారెడ్డి, జోనల్‌ అధ్యక్షులు వినోద్‌బాబు,కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలలోనే శాస్త్రాన్ని నేర్చుకోవడం కాకుండా, తమ దైనందిన జీవితంలో శాసీ్త్రయ సూత్రాలను అమలుచేసేలా శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక బాలాజీనగర్‌ (తెలుగు) ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌ ప్రదర్శనలు పరిశీలించారు. ఉత్తమ ప్రదర్శ న కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

ఉచిత విద్యకు  దరఖాస్తుల ఆహ్వానం 1
1/1

ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement