జననేత రాకతో అభిమాన సాగరం ఉప్పొంగింది. పసిడిపురి జనసంద్రమైంది. వైఎస్‌ జగన్‌కు ప్రొద్దుటూరు బ్రహ్మరథం పట్టింది. అడుగడుగునా నీరాజనాలు, దారిపొడవునా పూల వర్షాల మధ్య పర్యటనంతా జన జాతరను తలపించింది. అభిమానుల కేరింతలు.. జై జగన్‌ నినాదాలతో రామేశ్వరం బైపాస్‌ రోడ్డు | - | Sakshi
Sakshi News home page

జననేత రాకతో అభిమాన సాగరం ఉప్పొంగింది. పసిడిపురి జనసంద్రమైంది. వైఎస్‌ జగన్‌కు ప్రొద్దుటూరు బ్రహ్మరథం పట్టింది. అడుగడుగునా నీరాజనాలు, దారిపొడవునా పూల వర్షాల మధ్య పర్యటనంతా జన జాతరను తలపించింది. అభిమానుల కేరింతలు.. జై జగన్‌ నినాదాలతో రామేశ్వరం బైపాస్‌ రోడ్డు

Mar 6 2026 8:21 AM | Updated on Mar 6 2026 8:21 AM

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రొద్దుటూరులో జనం నీరాజనం పట్టారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్‌ రెడ్డిల వివాహ రిసెప్షన్‌ కార్యక్రమానికి గురువారం జగన్‌ హాజరయ్యారు. హెలీకాప్టర్‌లో వచ్చిన వైఎస్‌ జగన్‌ రామేశ్వరంలో నిర్మించిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని రిసెప్షన్‌ వేదికకు చేరుకున్నారు. ఆ దారంతో జనం పోటె త్తారు. జగన్‌ అందరికీ చిరునవ్వుతో అభివాదం చేశారు.

హెలీప్యాడ్‌ వద్ద జగన్‌ను కలిసిన నేతలు

జగన్‌ రాక సందర్భంగా రామేశ్వరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద పలువురు నేతలు ఆయనను కలిసి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి అంజద్‌ బాషా, మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మాజీ మేయర్‌ కె.సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోరెడ్డి నరసింహారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల కన్వీనర్‌ మార్తల చంద్ర ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌

జగన్‌ ప్లకార్డుతో

ఓ అవ్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement