భక్తిశ్రద్ధలతో పుష్పయాగం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పుష్పయాగం

Mar 6 2026 8:21 AM | Updated on Mar 6 2026 8:21 AM

గుర్రంకొండ: మండలంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పుష్పయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement