ప్రొద్దుటూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉద యం ప్రొద్దుటూరుకు రానున్నారు. రామేశ్వరం బైపాస్ రోడ్డులోని వైవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రాదరెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్ రెడ్డి రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 11.10 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను కలుసుకున్న అనంతరం రోడ్డు మార్గం ద్వారా వేదిక వద్దకు వెళ్తారు. దారి పొడవునా భద్రత ఏర్పాట్లను ఏఎస్పీ విభూ కృష్ణ పరిశీలించారు. ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.
నల్గొండ గద్దర్ నరసన్న రాక
రిసెప్షన్ కార్యక్రుమానికి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆహ్వానం మేరకు నల్గొండ గద్దర్ నరసన్న రానున్నారు. పాటలు పాడనున్నారు.


