మదనపల్లెటౌన్: మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఓపెన్ హౌన్ నిర్వహించారు.మహిళా దినోత్సవ వారోత్సవాలను పురష్కరించుకుని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో విద్యార్థులకు ఏర్‌ఆర్ పోలీసులు ఆయుధాల వాడకంపై అవగాహన కల్పించారు. పోలీసులు నిత్యం వాడే 303 తుపాకులు మొదలుకొని శక్తివంతమైన ఏకే–47, 7.62ఎంఎంసెల్ప్ లోడింగ్ రైఫిల్, 9ఎంఎం పిస్టల్స్, టియర్ గ్యాస్‌ను ప్రదర్శనలో ఉంచారు. ఆయుధాలు ఎలా వాడుతారో పోలీసులు ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. బుల్లెఫ్రూప్ జాకెట్లు, రైట్ గేర్ పరికరాలను విద్యార్థులు ధరించి వాటి పనితీరును తెలియజేఽశారు.


