ఆ ఇద్దరు ఉద్దండులు | - | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఉద్దండులు

Nov 21 2026 2:32 AM | Updated on Nov 21 2026 2:32 AM

● తొలి మండల పరిషత్‌ పోరులో

ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవం

● ఎన్టీఆర్‌ ప్రచారం చేసినా గెలిచిన

ప్రత్యర్థి ప్రకాష్‌రావ్‌

బి.కొత్తకోట: 1987లో జరిగిన మండల ప్రజా పరిషత్‌ తొలి ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెండు విశేషాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఆ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పేరున్న కుటుంబాలు ఎంపీపీలు అయ్యారు. అయితే తంబళ్లపల్లెలోని పెద్దమండ్యం మండల ఎంపీపీ ఎన్నికల్లో పోటీ లేకుండా కలిచర్లకు చెందిన కడప ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి మాజీ ఎమ్మెల్యే కడప నరసింహారెడ్డి కుమారుడైన ప్రభాకర్‌రెడ్డి ఎంపీపీ అయిన తరవాత మూడుసార్లు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి 1989లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటిచేసి గెలిచారు. ఇదే ఎన్నికలో బి.కొత్తకోట నుంచి సీఎస్‌.ప్రకాష్‌రావ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీపీ పదవికి పోటీచేశారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీకి చెందిన సీతారామిరెడ్డి పోటీచేశారు. ఈయన గెలుపు కోసం అప్పటి సీఎం ఎన్టీరామారావు హెలికాప్టర్‌లో బి.కొత్తకోటకు వచ్చి ప్రచారం నిర్వహించినా ఓటమి తప్పలేదు. ప్రకాష్‌రావ్‌ గెలిచారు.

ప్రభాకర్‌రెడ్డి

ప్రకాష్‌రావ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement