విద్యా వికాసమే మానవ వనరుల అభివృద్ధికి పునాది | - | Sakshi
Sakshi News home page

విద్యా వికాసమే మానవ వనరుల అభివృద్ధికి పునాది

Nov 21 2026 2:32 AM | Updated on Nov 21 2026 2:32 AM

మదనపల్లి (కురబలకోట): జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి (హ్యూమన్‌ రీసోర్సు డెవలప్‌మెంట్‌) లక్ష్యంగా విద్య, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మానవ వనరుల అభివృద్ధి అంశాల శాఖల పనితీరు, ప్రగతిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, హాజరు శాతం పెరుగుదల, సంక్షేమ వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండడంపై జిల్లా కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరులో జిల్లా 11వ స్థానంలో ఉన్నందున మరింత మెరుగైన స్థానానికి చేరుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. సోమల, రాయ చోటి, మదనపల్లి, కలికిరి, కురబలకోట మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తక్కువుగా ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్‌ ఈ పథకాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement