సాక్షి, ప్రకాశం జిల్లా: టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన కొత్తగా పెళ్లయిన జంటను రిమ్స్‌కి తరలించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు.. సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. మృతులను ఒంగోలు, బాపట్ల వాసులుగా గుర్తించారు.
మరో ఘటనలో..
అదుపు తప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండల పరిధిలోని రామచంద్రకోట వద్ద జరిగింది. ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన దర్శనం చిన్నా (29) మృతి చెందాడు. వివరాలు.. రామచంద్రకోటకు చెందిన దర్శనం చిన్న ద్విచక్ర వాహనంపై మార్కాపురం వైపునకు వెళ్తున్నాడు.
బైకు అదుపుతప్పి చిన్నా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రూ.ఏడు కోట్లు.. ఎక్కడ?


