సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పార్టీ దక్కించుకుంది. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా పెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతి, వైస్ చైర్మన్‌గా పాడేరు జెడ్పీటీసీ సీదరి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు పాల్గొన్నారు. జిల్లాలోని మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది.
ఇదీ చదవండి: పచ్చమూకల బరితెగింపు


