కావలి: ఈ నెల 5వ తేదీన పరిషత్ ఎన్నికల్లో జిల్లాతోపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అలజడులు జరిగాయి. కానీ.. బోగోలు మండలంలో అందుకు భిన్నంగా నామినేషన్ల పర్వం నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు ఎక్కడా చిన్నపాటి వివాదం లేకుండా ప్రశాంతంగా జరిగాయి. అయితే వైఎస్సార్‌సీపీ ఊహించిన ఫలితాలు తారుమారయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గతానికి భిన్నంగా జరగడం, వైఎస్సార్‌సీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న బోగోలు మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి క్లీన్‌స్వీప్ రావడంతో అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి.
దీని కంటే ముందు.. పోలింగ్ ముగిశాక బోగోలు మండలంలో అల్లిమడుగు సెగ్మెంట్ బ్యాలెట్ బాక్స్‌లు తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ముసునూరు టోల్‌గేట్ దాటాక చీకటి ప్రదేశంలో దాదాపు రెండు గంటలకుపైగా ఆగిపోయింది. అదే రోజు వైఎస్సార్‌సీపీ నేతలు బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేసి ఆరా తీసేందుకు ప్రయత్నించగా అతను మరుసటి రోజు వరకు స్పందించలేదు. ఫోన్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలకు మరుసటి రోజు ఉదయం స్పందిస్తూ.. పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు చెబుతున్నారు. పోలింగ్ సిబ్బంది వేతనాల బటా్వడా కోసం ఆగిందని ఒక దఫా, వేరే సెగ్మెంట్ల బాక్స్‌ల కోసమని మరో దఫా.. రకరకాలుగా చెప్పడంతో ఇంకా లోతుగా నిలదీయడంతో.. ‘నాకేం తెలియదు.. నన్ను వదిలేయండి’ అంటూ వేడుకున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.
‘అలిబి’ కోసమే.. టోల్‌గేట్ దాటించాకే బాక్స్‌లు మార్పు?
ఫలితాలు తారుమారు కావడం, ఆర్టీసీ డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పడం, తాజాగా కోవూరుపల్లి సర్పంచ్ అభ్యరి్థని పిలిపించి పోటీ నుంచి తప్పుకోవాలంటూ పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యలతో బోగోలు మండల పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు మార్చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. వాహనాలు టోల్‌గేట్ దాటినప్పుడు ‘ఫాస్టాగ్’ రికార్డవుతోంది. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఎవరైనా ప్రశి్నస్తే.. బస్సు ఎక్కడా ఆగలేదని చెప్పడానికి.. తప్పుడు సాక్ష్యంగా ‘అలిబి’ కోసమే సకాలంలోనే బస్సును టోల్‌గేట్ దాటించారని తెలుస్తోంది. పోలింగ్ సిబ్బందికి వేతనాల బట్వాడా చేయడానికే ఆగిందని తొలుత చెప్పారు. వాస్తవానికి వేతనాల బటా్వడా బ్యాలెట్ బాక్స్‌లు ఆర్వోలకు హ్యాండోవర్ చేశాకే జరుగుతుంది. కానీ దారి మధ్యలో ఆపి ఇచ్చారని చెప్పడం, ఆ తర్వా త మరో సెగ్మెంట్ బాక్స్‌ల కోసం వేచి ఉన్నామని చెప్పడంలో వాస్తవం లేదని స్పష్టమవుతోంది.
రాత్రి 10.30 గంటల తర్వాతనే స్ట్రాంగ్ రూమ్ వద్దకు బస్సు
విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. అల్లిమడుగు సెగ్మెంట్‌లోని చివరి పోలింగ్ బూత్‌ల్లోని బాక్స్‌లను 7.30 గంటలకు తీసుకెళ్లిన బస్సు.. రాత్రి 10.30 గంటల తర్వాతనే కావలిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను, బ్యాలెట్ బాక్స్‌లను రిసెప్షన్ కౌంటర్‌లో అందజేసిన సమయాన్ని పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టమవుతాయని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కౌంటింగ్ ప్రక్రియపైనా అనుమానాలు
వాస్తవానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ముగిసే వరకు ఎవరూ బయటకు వెళ్లరు. కానీ ఆ రోజు కౌంటింగ్ ప్రక్రియను మధ్యాహ్నం 2 గంటల వరకు జాప్యం చేసి.. భోజనం టైమ్ అంటూ అందరినీ బయటకు పంపించారు. దాదాపు గంట పాటు కౌంటింVŠ కేంద్రంలో ఏజెంట్లు లేకుండా చేసి.. అక్కడైనా బ్యాలెట్ బాక్స్‌లను తారు మారు చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి విధానాన్ని ఎప్పుడూ అనుసరించలేదు.
ఇదీ చదవండి: అనంతలక్ష్మి సంచలన నిర్ణయం.. టీడీపీకి రాజీనామా?


