ఏదైనా చేయాలనే ఆశతో బీజేపీలో చేరా.. కానీ | Why Padmini Thomas Quit BJP Reason Here | Sakshi
Sakshi News home page

బీజేపీకి పద్మిని థామస్ రాజీనామా

Nov 21 2026 2:47 PM | Updated on Nov 21 2026 2:47 PM

Why Padmini Thomas Quit BJP Reason Here

మళ్లీ కాంగ్రెస్‌లోకి మాజీ అథ్లెట్‌ పద్మిని

తిరువనంతపురం: మాజీ అథ్లెట్‌ పద్మిని థామస్‌ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైందని ఆమె ఆరోపించారు. బీజేపీ కేర‌ళ‌ రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉన్న పద్మిని థామస్‌ తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, ఆ పార్టీని తన కుటుంబంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఏదైనా చేయాలనే ఆశతో బీజేపీలో చేరానని, అయితే రెండేళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షురాలి పదవిలో కూడా ఏమీ చేసే అవకాశం లేదని పద్మిని పేర్కొన్నారు. ఏ ప్రత్యేక ఒప్పందాలతో బీజేపీలో చేరలేదనీ, చేరిన తర్వాత పార్టీ నాయకత్వం తనకు అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. 

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కరుణాకరన్‌ కుమార్తె పద్మజ వేణుగోపాల్‌ బీజేపీకి రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే పద్మిని థామస్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదీ చ‌ద‌వండి: అజంఖాన్ వ‌ర్సెస్ అస‌దుద్దీన్‌ ఒవైసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement