ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | Ys Jagan Expresses Shock Over Road Accident In Prakasam District | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Nov 21 2026 1:19 PM | Updated on Nov 21 2026 1:19 PM

Ys Jagan Expresses Shock Over Road Accident In Prakasam District

సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్న వైఎస్‌ జగన్.. శుభకార్యానికి వెళ్లి వస్తున్న కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన కొత్తగా పెళ్లయిన జంటను రిమ్స్‌కి తరలించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు.. సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. మృతులను ఒంగోలు, బాపట్ల వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి: పచ్చమూకల బరితెగింపు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement