చంద్ర‌బాబు చేతిలో పావులా మారిపోయిన షర్మిల | Sharmila has become a pawn in Chandrababu's hands. | Sakshi
Sakshi News home page

చంద్ర‌బాబు చేతిలో పావులా మారిపోయిన షర్మిల

Nov 21 2026 6:59 PM | Updated on Nov 21 2026 6:59 PM

Sharmila has become a pawn in Chandrababu's hands.

చంద్రబాబు డైరెక్షన్‌లో షర్మిల మరో సరికొత్త డ్రామా ఆడుతున్నారు. తన కుమార్తె వివాహాన్ని వివాదం చేయడం ఇష్టం లేదంటూనే.. హై డ్రామాలకు తెరలేపుతున్నారు. శనివారం ఉదయం ఉదయం 11 గంటలకు చంద్రబాబు ‍ప్రెస్‌మీట్‌ పెట్టి షర్మిలకు డైరెక్షన్‌ ఇచ్చారు. స్క్రిప్టు మొత్తం రెడీ కావడంతో రేపు బెంగళూరులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందుకు ధర్నాకు సిద్ధమయ్యారు షర్మిల. చంద్రబాబు కోసం అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అవమానించేందుకు షర్మిల సిద్ధమయ్యారు.

ఇప్పటికే షర్మిల, బాబు అండ్‌ కో పచ్చి అబద్ధాలతో వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగతంగా బురద చల్లుతున్నారు. రేపు వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు ఆందోళన చేయబోతున్నారన్న విషయం ఎప్పటిలాగే ఎల్లో మీడియాకు తెలిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే పనిగా బ్రేకింగులు వేసింది. అంతకుముందే చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టడంతో చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న కుట్రలో భాగంగానే షర్మిల డ్రామా చేస్తుందని తేలిపోయింది. తనకు మద్దతుగా రావాలని విజయమ్మపై షర్మిల ఒత్తిడి తీసుకువస్తున్నారు. తనకు చెందని, హక్కులేని ఆస్తుల కోసమే కాదు.. అంతకు మించి రాజకీయ ఆకాంక్ష కోసం పదే పదే ఆరాటపడుతున్నారు షర్మిల.  

చంద్రబాబు కుట్రలు కుటుంబాల్లో కూడా చిచ్చులు పెట్టేలా ఉంటాయి. ఇటీవల ‘‘సాక్షి’’లో వచ్చిన ‘‘చెట్టపట్టాల్‌’’ అన్న పదంపై షర్మిలతో పాటు నారా లోకేశ్‌ కూడా అనవసర రాద్ధాంతం చేస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును షర్మిల కలిసిన సమయంలో ఆ రచ్చ చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ చేసిన కుట్రలు అన్నీఇన్నీ కాదు. 

వాటి నుంచి డైవెర్షన్‌ కోసం, అలాగే, రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిలతో ఈ డ్రామాలు ఆడిస్తున్నారు చంద్రబాబు. డిఫెన్స్‌ మోడ్‌లో పడిన సమయంలో ఇటువంటివి చేయడం, చేయించడం చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు. ఎల్లో మీడియాలోను ఇందుకోసం వాడాల్సినంత వాడేస్తుంటారు. చంద్రబాబుతో కలిసి షర్మిల మరీ ఇంతలా దిగజారి వైఎస్‌ జగన్‌పై బురదచల్లే ప్రయత్నాలు చేయాలా? మొత్తానికి ఈ ఇష్యూలతో చంద్రబాబు, షర్మిల వీళ్లందరూ ఒకటేనని రాష్ట్ర ప్రజానికానికి అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement