వైఎస్‌ జగన్‌పై షర్మిల మరో కుట్ర | Sharmila and Chandrababu another conspiracy against YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై షర్మిల మరో కుట్ర

Nov 21 2026 7:26 PM | Updated on Nov 21 2026 7:29 PM

Sharmila and Chandrababu another conspiracy against YS Jagan

వైఎస్సార్‌ కుటుంబాన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు దశాబ్దాలుగా కుట్రలు చేసిన చంద్రబాబుతోనే నేడు షర్మిల కుట్రలు చేయడం చూస్తే అత్యంత ఆక్షేపనీయం. పచ్చ ముఠాతో అంతర్గత పొత్తు పెట్టుకుని వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు షర్మిల పావులు కదుపుతూనే ఉంది. మంచి-చెడు లేకుండా విచక్షణ మరిచి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు కుట్రలో భాగంగా మారిపోయింది షర్మిల.  

ఈ నేపథ్యంలో బాబుతో కలిసి మరో కొత్త డ్రామాకు తెరలేపింది షర్మిల.  రేపు(ఆదివారం)  బెంగళూరులోని వైఎస్‌ జగన్‌  ఇంటి ముందు ధర్నాకు సిద్దమైందంటూ ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టిన తర్వాత, షర్మిల ధర్నాకు సిద్ధమయ్యేందనే వార్తలు ఎల్లో మీడియాలో రావడం వెనుక చంద్రబాబు-షర్మిల కలిసి వైఎస్‌ జగన్‌పై మరో కుట్రకు తెరలేపుతున్నారనే దానికి నిదర్శనం. 

రాజకీయ ఆకాంక్ష కోసం పదే ఆరాట పడుతున్న షర్మిల..  చంద్రబాబు డైరక్షన్‌లో పచ్చ మూఠాతో కలిసి సొంత అన్న టార్గెట్‌గా అడుగులు వేస్తుంది. తనకు చెందని, హక్కులేని ఆస్తుల కోసమే కాదు.. అంతకు మించి షర్మిల రాద్దాంత చేస్తుంది. చంద్ర‌బాబు టైం లైన్‌లో ప‌నిచేస్తున్న ష‌ర్మిల‌.. చంద్ర‌బాబు చేతిలో పావులా మారిపోయారు. సొంత కూతురి పెళ్లిని సైతం రాజ‌కీయం చేస్తుంది షర్మిల. 

వ్యక్తిగత ప్రయోజనాలతోనే..?
వైఎస్సార్‌ కుటుంబాన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు దశాబ్దాలుగా కుట్రలు చేసిన చంద్రబాబుతోనే షర్మిల కుట్ర పూరిత రాజకీయాలు చేయడానికి కారణం వ్యక్తిగత ప్రయోజనాలే కనబడుతున్నాయి. సాక్షి కథనంపై షర్మిల ట్వీట్, దానికి మద్దతుగా లోకేశ్‌ చేసిన ట్వీట్‌లోని అంశాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 

వైఎస్సార్‌ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చేసిన కుట్రలను మరిచిపోయి మరీ చంద్రబాబుతో షర్మిల రాజకీయ స్నేహం చేస్తుంది. ఇందులో వైఎస్‌ జగన్‌ను బద్నాం చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. చంద్రబాబుతోనూ ఆయన ముఠాతోనే వైఎస్సార్‌ మూడు దశాబ్దాలు పాటు పోరాటం చేశారు. 

వైఎస్సార్‌ కుటుంబాన్ని అవమానిస్తున్నా..
ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు. వైఎస్సార్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే బాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై ఉన్న ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు.

ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా వైఎస్సార్‌ కుటుంబాన్ని ఎలా కష్టల పాలు చేశారో అంతా చూశారు. అన్యాయంగా వైఎస్‌ జగన్‌ను నిర్బంధానికి గురి చేయడం, చివరకు షర్మిల వ్యక్తిత్వంపైనే దారుణమైన దాడి చేశారు. ఇప్పుడు అదే షర్మిల.. అదే చంద్రబాబుతో కలిసి రాజకీయ కుట్రలు చేయడం, అది కూడా సొంత అన్న వైఎస్‌ జగన్‌ టార్గెట్‌ వ్యూహాలు రచించడం చూసి వైఎస్సార్‌ అభిమాని దిగ్భ్రాంతికి గురవుతున్నాడు. 

బాబు చేసే ప్రతీ కుట్రలో షర్మిల తోడ్పాటు
తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. ‘అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్‌ తరఫున ఏపీకి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారనేది అందరికి తెలిసిన వాస్తవం. బహిరంగంగా బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబుతో రాజకీయ స్నేహం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే అలా చేశారు షర్మిల. వైఎస్‌ జగన్‌ విజయావకాశాలను దెబ్బతీసేందుకు బాబు చేసే కుట్రలకు ఫర్మిల తన సహకారం అందించారు. 

వ్యక్తిగత లేఖలు.. ఎల్లో మీడియా ద్వారా లీకులు
వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి అన్న వైఎస్‌ జగన్‌కు షర్మిలకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు.. అత్యంతం గోప్యంగా ఉండాల్సిన లేఖలు.. ముందుగా టీడీపీ అధికారిక హ్యాండిల్స్‌లో ఏ రకంగా  కనిపించాయి. ? బెంగళూరు ఇంటి విషయంలో అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లో వీుడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు బయటకు వచ్చాయి.  అంటే ఇక్కడ చంద్రబాబుకు ఏదొక రకంగా రాజకీయ ప్రయోజనం చేకూర్చాలనే కుట్రలో భాగంగానే వ్యక్తిగత లేఖలను ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇవ్వడం వెనుక ఎవరున్నారు. ఇలా ప్రతీ అంశంలో వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా బద్నాం చేసేందుకు చేస్తున్న చంద్రబాబు-షర్మిల కుట్రలను చూసి   వైఎస్సార్‌ అభిమానులు, రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

షర్మిల ధర్నాపై పెద్ద ఎత్తున పచ్చ మీడియా ప్రచారం..
కుమార్తె పెళ్లిని సైతం రాజకీయంగా వాడుకుంటున్నారు షర్మిల. చంద్రబాబు కోసం చంద్రబాబు అన్న జగన్‌ను అవమానించేందుకు సిద్ధమయ్యారు. మరో మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి పెట్టుకుని అన్న  ఇంటి ముందు డ్రామాకు సిద్ధమయ్యారు షర్మిల. చంద్రబాబు కుట్రలో భాగంగా బెంగళూరులోని వైఎస్‌ జగన్‌ నివాసం ముందు ఆందోళన పేరుతో హైడ్రామాకు తెరతీయనున్నారు షర్మిల. 

ఇప్పటికే అబద్ధాలతో వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగతంగా బురద జల్లుతున్న షర్మిల, బాబు అండ్‌ కో.. ఉదయం 11గం.లకు ప్రెస్‌మీట్‌ పెట్టి షర్మిలకు బాబు డైరక్షన్‌ ఇచ్చారు. చంద్రబాబు డైరక్షన్‌ అనుకూలంగా ఇప్పటికే బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు షర్మిల. అదే సమయంలో రేపు షర్మిల బెంగళూరులో ధర్నా చేస్తారని పెద్ద ఎత్తున  పచ్చ మీడియా ప్రచారం ప్రారంభించింది. రేపు బెంగళూరులో  అన్నా చెల్లెళ్ల బిగ్‌ ఫైట్‌ అంటూ ఏబీఎన్‌ చానల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బ్రేకింగ్ న్యూస్‌ అంటూ ఊదరగొట్టారు. ఇది చంద్రబాబు డైరక్షన్‌లో నడుస్తున్న కుట్ర అనేది క్లియర్‌గా అర్ధమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement