చంద్రబాబుతో రాజకీయాలు చేస్తూ వైఎస్ జగన్‌పై కుట్రలు చేస్తున్న షర్మిల.. వైఎస్సార్ వారసత్వానికి దూరమైనట్లేనని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త, రాజకీయ విశ్లేషకులు మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడం కోసం వైఎస్ జగన్ ఎంతో కష్టపడ్డారని, తండ్రి ఆశయాల కోసం కష్ట పడుతున్న అన్నకు మద్దతుగా ఉండకుంటా షర్మిల ఇలా చంద్రబాబుతో రాజకీయ కుట్రలు చేయడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
ఒకవేళ తన ఆస్తి అయితే బెంగళూరులో ధర్నా చేయడం దేనికని, కోర్టుకు వెళ్తే కోర్టు చెప్తుంది కదా?, మరి షర్మిల అలా చేయకుండా ధర్నాలు అంటూ లీకులు ఇవ్వడం ఏంటని నిలదీశారాయన. అంటే ఆ ఆస్తి తనది కాదనే విషయం అర్థమవుతుందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అన్నా-చెల్లెళ్ల మధ్య చిచ్చుపెట్టి దాన్ని ఒక వెపన్‌లా చంద్రబాబు వాడుకుంటున్నారని పురుషోత్తమ రెడ్డి విశ్లేషించారు.
YS రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి షర్మిల దూరమైనట్టే లెక్క: పురుషోత్తం రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడం కోసం జగన్ ఎంతో కష్టపడ్డాడు తండ్రి ఆశయాల కోసం కష్టపడుతున్న జగన్ మద్దతుగా ఉండకుండా ఇలా షర్మిల చేయడం ఏంటి? తన ఆస్థి అయితే బెంగళూరులో ధర్నా చేయడం ఎందుకు? కోర్టుకు వెళ్తే కోర్టే చెప్తుంది కదా?.. షర్మిల ఎందుకు అలా చేయడం లేదు?
— Sakshi (@SakshiNews) November 21, 2026
ఇదీ చదవండి: వైఎస్ జగన్‌పై షర్మిల మరో కుట్ర


