చంద్రబాబు నిజస్వరూపంపై నాడు షర్మిల ఏమన్నారంటే? | What did Sharmila say back then about Chandrababus true colors | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిజస్వరూపంపై నాడు షర్మిల ఏమన్నారంటే?

Nov 21 2026 9:31 PM | Updated on Nov 21 2026 9:36 PM

What did Sharmila say back then about Chandrababus true colors

ఇటీవల చంద్రబాబును షర్మిల కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిజస్వరూపంపై నాడు షర్మిల మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. నాడు బాబును తిట్టిన షర్మిల.. నేడు బాబుకు ఎందుకు మద్దతు తెలుపుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తనపై వ్యక్తిత్వహననం జరిగిందని వైఎస్‌ షర్మిల గతంలో చెప్పారు. దీని వెనుక టీడీపీ ఉందని స్వయంగా చెప్పారు.

చంద్రబాబు ఆటలో పావులా మారిన షర్మిల గతంలో ఏం చెప్పారంటే.. ‘‘ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటివి ఎవరు చేయగలరు? అంటే టీడీపీనే అని అర్థమైంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ నాపై దుష్ప్రచారం మరింత ఎక్కువ చేస్తారు. తప్ప తక్కువ చేయరని అర్థమైంది. వ్యక్తిగతంగా దీని గురించి మాట్లాడడం ఇబ్బందికరమైనప్పటికీ బయటకు వచ్చి పోలీస్‌కేసు పెట్టాల్సి వచ్చింది.

ఇప్పుడు పోలీసు వాళ్లు చెబుతున్నాదాన్ని బట్టి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ 36లో ఎన్‌బీకే అని ఓ బిల్డింగ్‌ ఉంది. ఆ బిల్డింగ్‌ బాలకృష్ణదని, అక్కడి నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్‌లను బట్టి పోలీసులు చెబుతున్నారు. బాలకృష్ణ బిల్డింగ్‌ నుంచి జరిగింది ఒకటైతే.. ఈ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానెళ్లన్నీ టీడీపీకి అనుకూలమైనవి. టీడీపీ ప్రమోట్‌ చేసేవి, ప్రత్యర్థులను కించపర్చుతుంటాయి. బాలకృష్ణకు, దీంతో సంబంధం లేదని ఎలా అనుకోను. బాలకృష్ణనే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేయించారని నేను విశ్వసిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో టీడీపీ గురించి అలా మాట్లాడిన షర్మిల ఇప్పుడేమో మరోలా వ్యవహరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement