స్థానిక సంస్థల ఎన్నికలు.. తాజా పరిణామాలు
చిత్తూరు జిల్లా
- టీడీపీలో అసమ్మతి సెగలు
- జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పూతలపట్టు జెడ్పీటీసీ శైలజ పేరును ఖరారు చేసిన టీడీపీ.
- వైస్ చైర్‌పర్సన్‌గా గుడుపల్లి జెడ్పీటీసీ మంజుశ్రీ ఎంపిక.
- జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశించి భంగపడిన బంగారుపాళ్యం జెడ్పీటీసీ సుచిత్ర, పాలసముద్రం జెడ్పీటీసీ జాహ్నవి, గుడిపాల జెడ్పీటీసీ మమతశ్రీ.
- మంత్రి నారా లోకేష్ అండదండలు ఉన్నవారికే, పార్టీకి ఆర్థికంగా ఫండ్ ఇచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ అసంతృప్తి నేతల ఆగ్రహం.
- పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ అసమ్మతి నేతల మండిపాటు.
టీడీపీలో రగడ..
- అనకాపల్లి..
- అనకాపల్లి జెడ్పీ పీఠం జనసేనకు కేటాయించడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి.
- అనకాపల్లి జెడ్పీ చైర్ పర్సన్‌గా మోటూరు నాగమణి ఎంపిక.
- జెడ్పీ పీఠాన్ని ఆశించిన దేవరపల్లి జెడ్పీటీసీ కిలపర్తి రాజేశ్వరి, నర్సీపట్నం జెడ్పీటీసీ సుకల రమణమ్మ..
- ఎంపీ సీఎం రమేష్‌పై అనకాపల్లి జిల్లా బీజేపీ నేతలు ఆగ్రహం..
- జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని కూడా బీజేపీకి ఇప్పించలేకపోయారని మండిపాటు
తిరుపతి జిల్లా
- పనబాక లక్ష్మి కుమార్తెకు నిరాశ
- జెడ్పీ చైర్‌పర్సన్ పదవికి మాజీ ఎమ్మెల్యే, నాగలాపురం జెడ్పీటీసీ హేమలత పేరును ప్రకటించిన టీడీపీ.
- జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయింపు.
- జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కుమార్తె పనబాక చేతన్‌కు నిరాశ.
నంద్యాల జిల్లా
- ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం
- ఉయ్యాలవాడ మండల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీలో హైడ్రామా.
- పెద్ద ఎమ్మానూరు ఎంపీటీసీ వెంకట రాముడు కిడ్నాప్ అయి 24 గంటలు గడుస్తున్నా ఆచూకీ లేదని ఆరోపణ
- ఈరోజు ఉదయం 11 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
- వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో రాముడు కుటుంబ సభ్యులు.
- స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ వర్గాల ఆరోపణ.
కాకినాడ జిల్లా
- యు.కొత్తపల్లిలో జనసేనలో విభేదాలు
- నేడు యు.కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక జరగనుంది.
- నిన్న ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి చేదు అనుభవం.
- ఎమ్మెల్యే నానాజీని దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లగొట్టిన జనసేనకు చెందిన మత్స్యకార మహిళలు.
- మహిళల ఆగ్రహంతో ఎమ్మెల్యే మరో ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.
- జనసేన రెబల్ ఎంపీపీ అభ్యర్థి ధనబాబుకు మద్దతుగా జనసేన శ్రేణులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా.
- ధనబాబుకు కోరం ఉన్నప్పటికీ ఎన్నిక వాయిదా వేయడంపై జనసేన నేతల ఆగ్రహం.
విజయనగరం జిల్లా
- జనసేన ఎమ్మెల్యేకు టీడీపీ షాక్
- నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి పూసపాటిరేగ ఎంపీపీ ఎన్నికలో ఎదురుదెబ్బ.
- బీఫామ్ లేకుండానే టీడీపీ నేతకు ఎంపీపీ పదవి కట్టబెట్టారంటూ జనసేన అభ్యంతరం.
- పొత్తు ధర్మాన్ని పట్టించుకోకుండా టీడీపీ నేతకు పదవి ఇచ్చారంటూ జనసేన వర్గాల అసంతృప్తి.
- బీఫామ్ లేకుండా ఎంపీపీ పదవి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రశ్న.
- ఈ వ్యవహారంపై రిటర్నింగ్ అధికారితో ఎమ్మెల్యే వాగ్వాదం.
పశ్చిమగోదావరి జిల్లా
- తాడేపల్లిగూడెంలో అభ్యర్థి ఇంటికి నిప్పు
- తాడేపల్లిగూడెంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయంటూ ఆరోపణలు.
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటికి నిప్పు
- 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ స్వప్న నామినేషన్ దాఖలు.
- జనసేన తరఫున పోటీ చేయాలని, లేదంటే నామినేషన్ ఉపసంహరించుకోవాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిపిన స్వప్న.
- అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న వేళ ఇంటికి నిప్పంటించిన దుండగులు.
- స్థానికులు గుర్తించి అప్రమత్తం చేయడంతో ప్రాణాలతో బయటపడిన స్వప్న కుటుంబ సభ్యులు.
- అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చిన బాధిత కుటుంబం.
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల బరిలో కొనసాగుతానని స్వప్న స్పష్టం.
- ఇంటికి నిప్పంటించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్.


