కూటమిలో ట్విస్ట్‌.. జనసేనకు టీడీపీ షాక్‌! | TDP Given Only 4 ZP Chairmen Posts To Janasena In AP | Sakshi
Sakshi News home page

కూటమిలో ట్విస్ట్‌.. జనసేనకు టీడీపీ షాక్‌!

Nov 20 2026 8:02 AM | Updated on Nov 20 2026 8:05 AM

TDP Given Only 4 ZP Chairmen Posts To Janasena In AP

సాక్షి, అమరావతి: కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ.. మిత్రపక్షం జనసేనకు గట్టి షాక్‌ ఇచ్చింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల పంపకంలో జనసేనకు మొండిచేయి చూపించింది. తొమ్మిది జెడ్పీ చైర్మన్‌ పదవులు ఇవ్వాలని జనసేన కోరగా.. కేవలం నాలుగింటితోనే సరిపెట్టుకోవాలని టీడీపీ తేల్చిచెప్పింది. జనసేనకు అంత బలం లేదన్నట్లుగా నాలుగు స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ తీరుపై జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

జెడ్పీ చైర్మన్‌ పదవుల రొటేషన్‌ను చివరి వరకు సాగదీసిన కూటమి పెద్దలు.. ఎన్నికలకు కొన్ని గంటల ముందు గురువారం అర్ధరాత్రి జిల్లాల వారీగా పదవుల కేటాయింపులను ప్రకటించారు. మొత్తం 27 జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో టీడీపీ 22 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. జనసేనకు నాలుగు, బీజేపీకి ఒకటి కేటాయించింది. జనసేనకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జెడ్పీ చైర్మన్‌ పదవులు దక్కాయి. బీజేపీకి కృష్ణా జిల్లా కేటాయించారు.

తొమ్మిది అడిగితే.. నాలుగే ఇచ్చారు!
కూటమిలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన పట్టుబట్టినప్పటికీ టీడీపీ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొమ్మిది జెడ్పీ చైర్మన్‌ పదవులు కావాలని జనసేన కోరగా.. నాలుగుకు మించి ఇచ్చేది లేదని టీడీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో టీడీపీ నిర్ణయించిన స్థానాలతోనే జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ సాగుతోంది. మరోవైపు వైస్‌ చైర్మన్‌ పదవుల పంపకంలో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 కేటాయించారు.

కడపపై బీజేపీ ఆశలు గల్లంతు
కడప జెడ్పీ చైర్మన్‌ పదవిపై బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రయత్నాలు చేసినా టీడీపీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. చివరకు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవిని బీజేపీకి కేటాయించారు. మొత్తంగా జెడ్పీ పదవుల పంపకంలో టీడీపీ అత్యధిక స్థానాలను దక్కించుకోగా.. జనసేనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదని జనసైనికులు రగిలిపోతున్నట్టు సమాచారం. 

ఇదీ చదవండి: పదవి కావాలంటే రూ.20 లక్షలు ఇవ్వాల్సిందే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement