తీరాన్ని తాకిన అక్వాన్‌ తుపాను | Cyclone Akvan Makes Landfall Coasts Of North Andhra And South Odisha | Sakshi
Sakshi News home page

తీరాన్ని తాకిన అక్వాన్‌ తుపాను

Nov 20 2026 7:19 AM | Updated on Nov 20 2026 7:40 AM

Cyclone Akvan Makes Landfall Coasts Of North Andhra And South Odisha

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను నుంచి తుపానుగా అక్వాన్‌ బలహీనపడింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను బాహ్య వలయం తాకింది. మరో 2 గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 21 కిమీ వేగంతో కదులుతున్న తుపాను.. ప్రస్తుతానికి ఇది కళింగపట్నంకి 80 కి.మీ, గోపాల్‌పూర్‌కి 130 కి.మీ, విశాఖపట్నంకి 160 కి.మీ, పూరీకి 220 కి.మీ, నరసాపురానికి 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని..  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్లు: 1070,112, 18004250101, మన మిత్ర 9552300009  వాట్సాప్ సంప్రదించాలని  ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

తుపాను ప్రభావంతో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 16 సెం.మీ, కంచిలి, కవిటిలో 10 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోంపేటలో 9.2 సెం.మీ, వజ్రపు కొత్తూరులో 4.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. 

ఇదీ చదవండి: జనసేన ‘కోట’లో పొలి‘కేకే’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement