తాడేపల్లిగూడెంలో జనసేన నేతల బరితెగింపు | Janasena Leaders Set Fire To House Of Ysrcp Candidate In Tadepalligudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో జనసేన నేతల బరితెగింపు

Nov 20 2026 7:03 AM | Updated on Nov 20 2026 7:30 AM

Janasena Leaders Set Fire To House Of Ysrcp Candidate In Tadepalligudem

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో జనసేన నేతల బరితెగించారు. కూటమి సర్కార్‌ రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటికి  జనసేన గూండాలు నిప్పెపెట్టారు.

38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున నల్లగొండ స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని జనసేన నేతలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పంటించారు.

స్థానికులు గమనించి అప్రమత్తం చేయడంతో స్వప్న కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో బాధిత కుటుంబం నడిరోడ్డుపైకి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోటీలో ఉంటామని స్వప్న తేల్చి చెప్పారు. ఇంటికి నిప్పంటించిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

ఇదీ చదవండి: బరితెగించి 'విధ్వంసం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement