సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో జడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు కలకలం రేపుతున్నారు. గోనెగండ్ల జడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు.. కౌంటింగ్ హల్ దగ్గర చెత్తకుప్పలో దొరికాయి. వైఎస్సార్‌సీపీ గుర్తుకు ఓటు వేసిన 50 బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు లెక్కింపు జరగడం అంటే ఇదేనా? ఆయన అంటూ మండిపడ్డారు.
కౌంటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గోనెగండ్ల జడ్పీటీసీ రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారులపై కోర్టుకు వెళ్తామంటూ రాజీవ్‌రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: జనసేన కార్యకర్త మృతిపై బీటెక్ రవి హైడ్రామా


