ఏలూరు జిల్లా: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం మెరకగూడెంలో జనసేనకు షాక్ తగిలింది. సుమారు జనసేన పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. 30 కుటుంబాలకు చెందిన సభ్యులంతా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలరాజు.
ఇదీ చదవండి: పోలీసుల అదుపులో బాలకృష్ణ పీఏ


