పిల్లల పెళ్లిళ్లను రాజకీయం చేయొద్దు.. షర్మిలకు కాకాణి పూజిత హితవు | Kakani Pujitha Advises Sharmila to Prioritize Family Bonds Over Politics | Sakshi
Sakshi News home page

పిల్లల పెళ్లిళ్లను రాజకీయం చేయొద్దు.. షర్మిలకు కాకాణి పూజిత హితవు

Nov 22 2026 7:29 PM | Updated on Nov 22 2026 7:40 PM

Kakani Pujitha Advises Sharmila to Prioritize Family Bonds Over Politics

సాక్షి,నెల్లూరు: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన రాజకీయ విమర్శల్లో కుటుంబ వేడుకలను భాగం చేయవద్దని వైఎస్సార్‌సీపీ నేత కాకాణి పూజిత సూచించారు. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కాకాణి పూజిత మాట్లాడుతూ..‘ఏ చెల్లయినా వైఎస్ జగన్ లాంటి అన్న ఉండాలని కోరుకుంటారు. ఆయన షర్మిలకు కలలో కూడా అన్యాయం చేయరు. చంద్రబాబు చెప్పినట్లే షర్మిల నడుచుకుంటున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రదృష్టితో చూడటం సరికాదు’ అని పేర్కొన్నారు.

పిల్లల వివాహాలను రాజకీయాలకు వేదికగా మార్చకూడదని కాకాణి పూజిత హితవు పలికారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లిళ్లు సంతోషంగా జరగాలని, తద్వారా పిల్లలకు మధురమైన జ్ఞాపకాలు అందించాలని సూచించారు. రాజకీయాల కంటే కుటుంబ బంధాలు, ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె షర్మిలను కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement