breaking news
Kakani Poojitha Reddy
-
మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్
-
అత్యాచారప్రదేశ్గా ఏపీ
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచారప్రదేశ్గా మార్చారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు లైంగికదాడికి పాల్పడడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్షా రాసిన లేఖే నిదర్శనమన్నారు. జగన్ చేతల సీఎం.. బాబు మాటల సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళల భదత్రకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పూజిత గుర్తుచేశారు. దిశ యాప్ను పటిష్టంగా అమలు చేశారని, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. ఆపదలో అబలలు ఉంటే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలంలో ఉండేవారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు.నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తామని డైలాగ్లు చెప్పే చంద్రబాబు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశి్నంచారు. పోలీసులు అధికారపక్ష సేవలో తరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మహిళల రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అమిత్షా సీఎం చంద్రబాబుకు లేఖరాశారని, దీనిపై ప్రజలకు సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
Nellore: మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో నిరసన
-
తండ్రిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కూతురు
-
జగనన్నకు కృతజ్ఞతలు.. ఇదొక సవాలుగా స్వీకరిస్తా
-
జగనన్నకు మేము తోడుగా ఉండి.. ఆడబిడ్డలు అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తాం
-
అక్రమ కేసులతో మా నాన్నను భయపెట్టలేరు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు: ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కాకాణి గోవర్థన్ రెడ్డి.. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు కాకాణి కుమార్తె పూజితా రెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రజలకి మంచి చేసిన ప్రతీసారి మా నాన్న మొహంలో ఆనందం కనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రాణాలని కూడా లెక్కచేయకుండా ప్రజలకి సదుపాయాలు కల్పించారు. మంత్రిగా పనిచేసిన రెండేళ్లలో మా నాన్నని నేను ఒక పదిసార్లు మాత్రమే చూశాను.. ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు. ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని.. శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.గతంలో పెట్టిన కేసుల్లో విచారణకు నాన్న వచ్చారు. ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి దూరంగా ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలని బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారు. మా నాన్నకు అండగా నిలుస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా నాన్న కడిగిన ముత్యంలా బయటకి వస్తారు’ అని వ్యాఖ్యానించారు.


