వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతమ్మలకు చెందిన బెంగళూరులోని యలహంక ఆస్తితో షర్మిలకు అసలు సంబంధం ఏంటని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. అది అసలు వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన ఆస్తి కాదని, భారతమ్మ తండ్రి ఈసీ గంగిరెడ్డికి చెందిన ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు.
భారతమ్మకు వాళ్ల తల్లి దండ్రులు సుగుణమ్మ-ఈసీ గంగిరెడ్డిల ద్వారా వచ్చిన ఆస్తి అని ఆయన తెలిపారు. మరి అటువంటప్పుడు ఆ ఆస్తిలో షర్మిలకు వాటా ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఆ ఆస్తి వైఎస్సార్‌ది అయితే వీళ్ల ఫ్యామిలీకి చెందిన వారి పేర్లే ఉండేవి కదా... క్లియర్‌గా తల్లి దండ్రుల ద్వారా అది భారతమ్మకు వచ్చిన ఆస్తి అని రిజిస్ట్రేషన్ రికార్డులు చెబుతున్నాయన్నారు.
ఈ క్రమంలోనే షర్మిలకు పలు ప్రశ్నలు సంధించారాయన. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నానని షర్మిల అంటున్నారని, కనీసం ఒక్క కరెంట్ బిల్లు అయినా షర్మిల పేరు మీద ఉందా?, వాటర్ బిల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, ఇలా ఏదొక బిల్లు అయినా ఆ పేరు మీద ఉండాలి కదా? మరి లేదు అంటే షర్మిలకు ఆ ఆస్తితో సంబంధం ఎలా ఉంటుందన్నారు. ఆస్తిలో వాటా అంటూ షర్మిల రాద్ధాంతం చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు సతీష్‌రెడ్డి.
ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్టు.. ఎల్లో మీడియా కోరస్!


