‘రోడ్డెక్కి పార్టీ పరువు తీయకండి’: సీఎం రేవంత్ అసహనం | Cm Revanth Reddy Warns MLAs Against Public Remarks | Sakshi
Sakshi News home page

‘రోడ్డెక్కి పార్టీ పరువు తీయకండి’: సీఎం రేవంత్ అసహనం

Nov 22 2026 3:40 PM | Updated on Nov 22 2026 3:50 PM

Cm Revanth Reddy Warns MLAs Against Public Remarks

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా చేస్తున్న విమర్శలు, అసంతృప్తి గళాలపై స్పందించిన ఆయన, పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేసే వారి కంటే సలహాలు ఇచ్చే వారే ఎక్కువయ్యారని వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘అందరూ నాకు సలహాలు ఇచ్చే వారే.. పని చేసే వారు లేరు. మంచి  మైక్‌లో చెప్పండి..చెడు నా చెవిలో చెప్పండి. ఇక నుంచి రోడ్లెక్కి మాట్లాడి పార్టీ పరువు తీయకండి’ అని ఆయన నేతలకు హితువు పలికారు.

మరోవైపు, ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పీఏసీ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే, సీఎం రేవంత్ ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. ‘ఈ ఒక్కసారికి వారిని వదిలేద్దాం. మరోసారి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా మాట్లాడితే అప్పుడు కచ్చితంగా చర్యలు తీసుకుందాం’అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement