‘పార్టీ లైన్‌ దాటి మాట్లాడేవారిని ఉపేక్షించొద్దు’.. కాంగ్రెస్‌ నేతలకు హెచ్చరిక | BM Sandeep warning to Congress leaders | Sakshi
Sakshi News home page

‘పార్టీ లైన్‌ దాటి మాట్లాడేవారిని ఉపేక్షించొద్దు’.. కాంగ్రెస్‌ నేతలకు హెచ్చరిక

Nov 22 2026 2:54 PM | Updated on Nov 22 2026 3:01 PM

BM Sandeep warning to Congress leaders

హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ బీఎం సందీప్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా బీఎం సందీప్ కుమార్ మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.

‘‘తెలంగాణలో అందరూ కలిసికట్టుగా పని చేయడం వల్ల గత ఎన్నికల్లో మనం రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగాము. గతంలో మనం ఐకమత్యంగా పని చేయడం వల్ల 64 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చాము. తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించాం. అధికారంలోకి వచ్చిన మనం ఇక్కడ అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాము. దేశంలో ఎల్ నినో వల్ల తీవ్రమైన కరవు ఏర్పడింది. 

అయితే, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదు. వారు సహాయ నిరాకరణ చేసినా కూడా మనం కరవును ఎదుర్కొంటూ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాం. ఇప్పుడు మనం మరింత ఉత్సహంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో మరిన్ని అధిక స్థానాలు సంపాదించాలి.

కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. గతంలో ఇక్కడ పని చేసిన ఏఐసీసీ ఇంచార్జ్‌లు పార్టీని బలోపేతం చేయడంలో చాలా కృషి చేశారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి మనం పని చేయాలి. సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ పుస్తకానికి దేశంలో చాలా ప్రాధాన్యం వచ్చింది. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాలు ఈ దేశంలో ప్రజల మనసులో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి. మనం అంత కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలి’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement