మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కిరాతకుడు | Woman Incident In Nalgonda District | Sakshi
Sakshi News home page

మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కిరాతకుడు

Nov 22 2026 8:08 AM | Updated on Nov 22 2026 8:08 AM

Woman Incident In Nalgonda District

కనగల్‌: నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలోని తొరగల్‌ గ్రామంలో ఓ వ్యక్తి మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ మహిళ చికిత్సపొందుతూ మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన మెగావత్‌ హనుమాన్‌ నాయక్‌.. కనగల్‌ మండలం తొరగల్‌లో వరి ధాన్యం పట్టాలను అద్దెకిస్తూ ఉపాధి పొందుతున్నాడు. 

హనుమాన్‌ నాయక్‌కు నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన మహిళ బొమ్మిశెట్టి రమణ(42)తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె తరచూ హనుమాన్‌ నాయక్‌ వద్దకు వచ్చి వెళ్తుండేది. ఇదే క్రమంలో శుక్రవారం హనుమాన్‌ నాయక్‌ నివాసానికి రమణ వచ్చింది. అయితే, రమణపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉంటూనే రాత్రి 8 గంటల సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 

దీంతో రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగువారు గమనించి చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. మృతురాలి సోదరుడు బండారు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement