గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలోని పలు విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిన రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గాంధీ ప్రిన్సిపాల్ ప్రొ. ఇందిర తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డీహెచ్‌ఆర్) సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్ (ఎంఆర్‌యూ) ద్వారా రీసెర్చ్ సైంటిస్ట్–2 (సైంటిస్ట్–సీ), రీసెర్చ్ సైంటిస్ట్–1 (సైంటిస్ట్–బీ), ల్యాబ్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) ఒక్కో పోస్టుకు, ల్యాబ్ టెక్నీషియన్ రెండు పోస్టులు, మొత్తం ఐదు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పూరించిన దరఖాస్తుఫారాలు గాంధీ మెడికల్ కాలేజీలో సమరి్పంచాలని, డిసెంబర్ 2వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు.
వీఆర్‌డీఎల్ ఆధ్వర్యంలో..
స్టేట్ లెవల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీ (వీఆర్‌డీఎల్) గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు. రీసెర్చ్ సైంటిస్ట్ (మెడికల్), రీసెర్చ్ సైంటిస్ట్ (నాన్ మెడికల్) డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్‌స్టాఫ్ ఒక్కో పోస్టుకు, ల్యాబోరేటరీ టెక్నీషియన్ రెండు పోస్టులు మొత్తం ఆరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆమె వివరించారు.
పూరించిన దరఖాస్తు ఫారాలు ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమరి్పంచాలని, డిసెంబర్ 1వ తేదీన వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలను గాంధీ మెడికల్ కాలేజీ వెబ్‌సైట్ https:// gmcsecunderabad.org/ లో పొందవచ్చని సూచించారు.


