ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: పెళ్లయి ఇద్దరు కూతుర్లు ఉన్నా, కొడుకు పుట్టలేదనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ సందేశం పంపాడు. భర్త వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకాయుక్త కాలనీలో నివసించే నిఖత్ అఫ్రీన్‌కు ఎండీ అలీ అర్షద్‌తో 2015 ఆగస్టులో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంతకాలంగా అఫ్రీన్‌కు, ఆమె భర్త కుటుంబ సభ్యుల మధ్య కోర్టులో న్యాయ వివాదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో గత నెల 24న అఫ్రీన్‌కు ఫోన్ చేసిన అర్షద్.. డిసెంబర్ లోపు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. తనకు థాయ్‌లాండ్‌లో ఉద్యోగం వచి్చందని, ఇకపై నీతో పాటు కూతుర్ల అవసరం కూడా లేదని తేలి్చచెప్పాడు. మరుసటి రోజు.. ’నువ్వు నాకు నచ్చలేదు, నాకు కొడుకు కావాలి, కూతుర్లు వద్దు.. అందుకే నీకు తలాక్ ఇస్తున్నాను’ అంటూ ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ సందేశం పంపించాడు. దీంతో తన భర్త అర్షద్, అత్త షహానా బేగం, ఆడపడుచు అర్షియా అలియాస్ సనాలపై బాధితురాలు సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.


