షర్మిలతో కలిసి వైఎస్ జగన్ కుటుంబంపై కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడు నెట్ వర్త్ వేల కోట్ల రూపాయల పైమాటేనని, మరి ఆయన ఏమైనా చెల్లెళ్లకు తన ఆస్తిలో వాటా ఇచ్చారా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి.
అలాగే చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తూ వేరే వాళ్ల కుటుంబాలపై కుట్ర పూరిత వ్యూహాలు రచించే ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ-5 అధినేతలకు కూడా అక్కా చెల్లెళ్లు ఉంటారు కదా.. వారికి వీళ్లు ఎంత ఆస్తి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ విషయాల్ని వీళ్లు చెప్పరు.. ఎవరూ కూడా అడగకూడదు.. కానీ వైఎస్ జగన్‌కు చెందిన ఆస్తిలో షర్మిలను ఉసిగొల్పడానికి మాత్రం పావులు కదుపుతారని సతీష్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: పక్కా ప్లానింగ్‌తో బెంగళూరుకు ఎల్లో మీడియా!


