హైదరాబాద్: బెంగళూరు వేదికగా షర్మిలతో చంద్రబాబు నాయుడు చేయిస్తున్న కుట‍్రలపై రిటైర్డ్ ఏఎస్‌పీ రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాక్షి డిబేట్‌లో రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ... తన చెల్లి తనకు వ్యతిరేకంగా మారడడమే కాకుండా, ప్రత్యర్థుల చేతుత్లో పావుగా మారి తన నాశనాన్ని కోరుకుంటుండడంతో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గారని తెలిపారు.
‘‘అంతేగానీ, అంతకుముందు ప్రేమతో ఎన్నో ఆస్తులు రాసిచ్చారు కదా? ఆమెకు. ఎప్పుడో తన తండ్రి బతికి ఉన్నప్పుడే షర్మిలకు కావాల్సింది ఆమెకు ఇచ్చారు. వైఎస్ జగన్‌కు రావాల్సింది ఆమెకు ఇచ్చారు. స్థిరాస్తులు అన్నీ మామూలుగా కొడుకుకే ఇస్తారు. దానికి విరుద్ధంగా జగన్ కంటే ఎక్కువగా షర్మిలకు ఇచ్చారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. చెల్లెలి మీద ప్రేమతో ‘‘సరస్వతి’’ దాంట్లోనూ ఇచ్చారు. ఆమెకు యలహంక ఆస్తి కూడా ఇస్తుండేనేమో. కానీ, భార్య వైపు నుంచి ఈ ప్రాపర్టీ వచ్చింది వైఎస్ జగన్‌కు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో వాస్తవాలను వక్రీకరించి చూపుతోంది’’ అని రాజేశ్వరరెడ్డి తెలిపారు.
డైవర్షన్ బాగా చేశానని అనుకుంటున్నారు..
ఎన్నికల వేళ డైవర్షన్ బాగా చేశానని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని రాజేశ్వరరెడ్డి చెప్పారు. ‘‘కానీ, ప్రజలు అందరూ అలర్ట్‌గానే ఉన్నారు. అన్ని గమనిస్తున్నారు. అనేక రకాలుగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్ని చేసినా కూడా వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లోనూ పోలీసులతో కలిసి గొడవ చేయించారు. షర్మిల ఏం చేసినా సరే.. అందుకు రెండు రోజుల ముందు ప్రోగ్రాంను సెట్ చేయడానికి టీడీపీ వస్తుంది. చంద్రబాబు నాయుడు వచ్చి ప్రెస్‌మీట్ పెడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏవీ పట్టవా మీకు?’’ అని నిలదీశారు.


