breaking news
Rajeshwara reddy
-
‘షర్మిల ఇష్యూతో డైవర్షన్ బాగా చేశానని బాబు అనుకుంటున్నారు’
హైదరాబాద్: బెంగళూరు వేదికగా షర్మిలతో చంద్రబాబు నాయుడు చేయిస్తున్న కుట్రలపై రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాక్షి డిబేట్లో రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ... తన చెల్లి తనకు వ్యతిరేకంగా మారడడమే కాకుండా, ప్రత్యర్థుల చేతుత్లో పావుగా మారి తన నాశనాన్ని కోరుకుంటుండడంతో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వెనక్కి తగ్గారని తెలిపారు. ‘‘అంతేగానీ, అంతకుముందు ప్రేమతో ఎన్నో ఆస్తులు రాసిచ్చారు కదా? ఆమెకు. ఎప్పుడో తన తండ్రి బతికి ఉన్నప్పుడే షర్మిలకు కావాల్సింది ఆమెకు ఇచ్చారు. వైఎస్ జగన్‌కు రావాల్సింది ఆమెకు ఇచ్చారు. స్థిరాస్తులు అన్నీ మామూలుగా కొడుకుకే ఇస్తారు. దానికి విరుద్ధంగా జగన్ కంటే ఎక్కువగా షర్మిలకు ఇచ్చారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. చెల్లెలి మీద ప్రేమతో ‘‘సరస్వతి’’ దాంట్లోనూ ఇచ్చారు. ఆమెకు యలహంక ఆస్తి కూడా ఇస్తుండేనేమో. కానీ, భార్య వైపు నుంచి ఈ ప్రాపర్టీ వచ్చింది వైఎస్ జగన్‌కు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో వాస్తవాలను వక్రీకరించి చూపుతోంది’’ అని రాజేశ్వరరెడ్డి తెలిపారు.డైవర్షన్ బాగా చేశానని అనుకుంటున్నారు..ఎన్నికల వేళ డైవర్షన్ బాగా చేశానని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని రాజేశ్వరరెడ్డి చెప్పారు. ‘‘కానీ, ప్రజలు అందరూ అలర్ట్‌గానే ఉన్నారు. అన్ని గమనిస్తున్నారు. అనేక రకాలుగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్ని చేసినా కూడా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లోనూ పోలీసులతో కలిసి గొడవ చేయించారు. షర్మిల ఏం చేసినా సరే.. అందుకు రెండు రోజుల ముందు ప్రోగ్రాంను సెట్ చేయడానికి టీడీపీ వస్తుంది. చంద్రబాబు నాయుడు వచ్చి ప్రెస్‌మీట్ పెడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏవీ పట్టవా మీకు?’’ అని నిలదీశారు. -
పచ్చని చెట్లపై పాషాణం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల కక్షలు, కార్పణ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి పచ్చని చెట్లను నాశనం చేసేందుకు కూడా వెనకాడటం లేదు. శుక్రవారం రాత్రి యల్లనూరు మండలం వెన్నపూసపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేశ్వరరెడ్డి చీనీ చెట్ల పాదుల్లో ప్రత్యర్థులు కిరోసిన్ పోశారు. దాదాపు 800 కాపు కాసే చీనీ చెట్లు నిట్టనిలువునా ఎండిపోయేలా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి చీనీ తోటను పరిశీలించారు. కిరోసిన్‌తో తడిచిన మట్టిని వెంటనే తొలగించి వేస్తే చెట్లు ఊపిరిపోసుకునే అవకాశమున్నా... గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణం నేపథ్యంలో ఆ పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వెన్నపూసపల్లెలో ఆధిపత్యమంతా జేసీ దివాకరరెడ్డి వర్గీయులదే. అక్కడ వారే అన్ని విషయాలనూ శాసించే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లుగా నిలబడ్డారు. గ్రామం మొత్తం జేసీ వర్గీయుల ఆధిపత్యమే ఉన్నప్పటికీ, వెన్నపూసపల్లి బూత్‌లో వైఎస్ఆర్సీపీకి దాదాపు 40 ఓట్ల మెజారిటీ వచ్చింది. రాజేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండటం వల్లే వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత వచ్చిందన్న ఉద్దేశంతో వారిని ఎలాగైనా గ్రామంలో లేకుండా చేయాలని జేసీ వర్గీయులు దాడులకు ఉపక్రమించారు. ఫిబ్రవరి 22న రాజేశ్వరరెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన కాలు, చెయ్యి విరిగి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రతాప్‌రెడ్డి, పార్థసారధి.. తదితర జేసీ వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల పాటు రిమాండులో ఉన్న వారు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున (ఏప్రిల్16) గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడైన అనిల్‌కుమార్ అనే దళితునిపై దాడి జరిగింది. నాలుగు రోజుల వ్యవధిలోనే జనార్దన రెడ్డి, బాబువల్లీలపైనా దాడి చేశారు. వీటిపై కనీసం ఫిర్యాదు చేసేందుకు కూడా బాధితులు సిద్ధపడలేదు. పై పెచ్చు గ్రామం వదలి వెళ్లిపోయారు. దీన్నిబట్టే గ్రామంలో ఎంత భయానక వాతావరణం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. కాగా, రాజేశ్వరరెడ్డి తల్లి సావిత్రి గ్రామంలోనే ఉంటూ చీనీ చెట్లను సంరక్షిస్తోంది. ఆయన్ను అన్ని రకాలుగా దెబ్బతీయాలనుకున్న ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి ట్రాక్టరులో కిరోసిన్ క్యాన్లు తీసుకుని వెళ్లి చీనీ చెట్ల పాదుల్లో పోసినట్లు సావిత్రి యల్లనూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కక్షలకు పచ్చని చెట్లను కూడా బలి తీసుకుంటున్న ఈ విషసంస్కృతికి టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డకట్ట వేస్తారో లేక వంతపాడుతారో చూడాల్సి ఉందని పరిసర గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. -
దాచేస్తే.. దాగునా!
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: అక్రమ నిల్వల గుట్టు రట్టయింది. రైతుల కష్టం దోచుకుంటున్న వ్యాపారులు, దళారుల దందా బుధవారం వెలుగులోకి వచ్చింది. గోదాముల్లో అక్రమంగా దాచిన ‘బస్తాల’ బాగోతం విజిలెన్స్ అధికారుల దాడితో బట్టబయలైంది. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లో రైతులు ఏటా అధిక విస్తీర్ణంలో పప్పు శనగ, వరి, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు దిగుబడులను నిల్వ చేసుకోలేని రైతులు.. వ్యాపారులు, దళారులు చెప్పిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. ఇలా తక్కువ ధరకు వ్యాపారులు, దళారులు కొనుగోలు చేసి.. మంచి రేటు రాగానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కొన్న పప్పుశనగలను గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కోవెలకుంట్ల పరిసర ప్రాంతాల్లోని పది గోదాముల్లో విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ డీఎస్పీ రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో సీఐలు శ్రీనివాసులు, పవన్‌కిషోర్ తనిఖీలు నిర్వహించగా అక్రమ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గోదాముల్లో రికార్డులు లేని సుమారు రూ.50 కోట్ల విలువ చేసే శనగ బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్లో బస్తా ధర రూ.2800 ఉండగా.. ఆ ధర ప్రకారం సుమారు 1.78 లక్షల శనగ బస్తాల అక్రమ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ మేరకు ఏ గోదాములో ఎన్నెన్ని బస్తాల అక్రమ నిల్వలు ఉన్నాయో విజిలెన్స్ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని పలు గోదాముల్లో ధాన్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు ఆరు నెలల క్రితమే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించడంతో వ్యాపారులు, దళారుల బాగోతం వెలుగులోకి వచ్చింది. కాగా రాత్రి బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో రెండు గోదాములపై దాడులు చేసి రూ. 10 కోట్ల విలువ జేసే పప్పుశనగ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.


