చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించి భారీ వసూళ్లు రాబెట్టిన చిత్రాల్లో.. ‘హనుమన్ అంశ్’ కూడా ఒకటి. కేవలం రూ.1.5 కోట్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా 360 కోట్లకు పైగా వసూళ్లు రాబెట్టింది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా వెండి తెరను ముద్దాడుతోంది. ఈ ఏడాది భారీ వసూళ్లను రాబెట్టిన ‘ధురంధర్2, ‘బోర్డర్2’ తర్వాత చిత్రంగా ఇది నిలిచినట్లు లెక్కలు చెబుతున్నాయి.
నిర్మాత అనుప్రియా నగర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా బడ్జెట్ రూ.1.5 కోట్లకు కొద్దిగా ఎక్కువేనని వెల్లడించారు. ఇందులో తాను స్వయంగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విశాల్ చతుర్వేది మాత్రం సినిమా నిర్మాణ సమయంలో ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్లు తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ఈ మేకింగ్ వీడియో చూశారా?
లాభాల్లో వాటా!
‘హనుమాన్ అంశ్’ కోసం విశాల్ చతుర్వేది దాదాపు 14 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని అనుప్రియా తెలిపారు. ‘కథను గతంలో పలువురు ఓటీటీ సంస్థలకు కూడా చెప్పినప్పటికీ సినిమా పట్టాలెక్కలేదు. చివరికి సహ నిర్మాతలు రాగిణి సోనా, నమ్రతా సింగ్ ఈ కథపై నమ్మకం ఉంచడంతో ప్రాజెక్ట్ మొదలైంది. బడ్జెట్ చాలా తక్కువగా ఉండటంతో విశాల్ తన దర్శకత్వానికి ఎలాంటి ఫీజు తీసుకోలేదు’ అనుప్రియా వెల్లడించారు. థియేట్రికల్ రన్ అంచనాలకు మించి వెళ్లడంతో నిర్మాతగా దాదాపు రూ.50 కోట్ల వరకు రావొచ్చని అనుప్రియా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల డీల్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. కాగా ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం.. ‘హనుమాన్ అంశ్’ 47 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.
వచ్చిన డబ్బుతో ఏం చేస్తారంటే..
సినిమా నుంచి ఇంత డబ్బు వస్తుందని ఊహించలేదని అనుప్రియా తెలిపారు. ఈ ఆదాయాన్ని సమాజానికి తిరిగి ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి మరిన్ని కథలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’..


