ఏడాదికి రెండు మూడు సినిమాలతో వచ్చే ధనుష్ ప్రస్తుతం 'ఓం' చేస్తున్నాడు. లెక్క ప్రకారం ఇది వచ్చే నెలలోనే రిలీజ్ కావాలి. కానీ రజనీకాంత్ 'జైలర్ 2' కారణంగా వాయిదా పడింది. నవంబరులో రిలీజ్ కావొచ్చు. ఇకపోతే తెలుగు నిర్మాత నాగవంశీతో ధనుష్ కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'లబ్బర్ పందు' తీసిన తమిళరసన్ పచ్చముత్తు దీనికి దర్శకుడు.
(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)
ఈ మూవీ లాంచ్ శుక్రవారం జరగ్గా.. ఇందులో ధనుష్‌తో పాటు సినిమాలు కీలక పాత్రలు చేస్తున్న ప్రీతి ముకుందన్, వడివేలు, ఎస్జే సూర్య తదితరులు పాల్గొన్నారు. అయితే 2009లో వచ్చిన 'పడిక్కాదవన్' సినిమా షూటింగ్ టైంలో ఇందులో నటిస్తున్న వడివేలు.. అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ధనుష్‌తో గొడవనే దీనికి కారణమని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కొత్త మూవీ లాంచ్ సందర్భంగా పాత విషయాలపై స్పందించిన వడివేలు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'చాలా ఏళ్ల తర్వాత ధనుష్ సర్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఇన్నేళ్లలో మేం కలిసి ఎందుకు నటించలేదా అని మీరనుకోవచ్చు. మూడో వ్యక్తి మా మధ్య పుల్లలు పెట్టడం వల్ల మా మధ్య వచ్చిన మనస్పర్థలే దీనికి కారణం. ఇప్పుడు చేస్తున్నది రాజకీయ సినిమా కాదు. డిఫరెంట్‌గా ఉంటుంది. కథ వినగానే నేను సర్‌ప్రైజ్ అయిపోయాను' అని వడివేలు చెప్పుకొచ్చాడు.
తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో రెండు ప్రొడక్షన్ హౌస్‌లతో కలిపి ధనుష్ 56వ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)
#Vadivelu:
"After a long gap I got an opportunity to work with #Dhanush sir with #D56. You might ask why there is so much gap that we didn't collaborate, it's because of some misunderstanding between us done by third person. It's not a Political film, it's very different film. I…— AmuthaBharathi (@CinemaWithAB) September 25, 2026


