తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తండ్రి, నటుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ‘హబీబీ’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడీ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.
‘హబీబీ’ చిత్రానికి మీరా కతివరన్ దర్శకత్వం వహించారు. విఎస్ మొహమ్మద్ కథ అందించారు. ఇందులో కస్తూరి రాజా ‘యూసుఫ్’ అనే చేనేత కార్మికుడి పాత్రలో కనిపించారు. మాళవికా మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుశ్రేయా రాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియాడికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రేమకథలో అప్పటి కాలానికి సంబంధించిన జీవన విధానం, భావోద్వేగాలను చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
A story told through a voice, a cassette, and a love that never left.#Habeebi streaming from 25th September only on #SonyLIV#ComingSoon #HabeebiOnSonyLIV pic.twitter.com/rPoe6A24fK
— Sony LIV (@SonyLIV) September 20, 2026


