‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఫహాద్ ఫాజిల్. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎస్‌ఎస్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలపై ఆసక్తికరంగా ముచ్చటించారు.
మీ సంగతి అక్టోబర్ 2న చెప్తా
అనంతరం కార్యక్రమంలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎస్‌ఎస్ రాజమౌళి ఏకంగా రూ.కోటి బిడ్ వేసి లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీనిని వేలంపాటలో సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ లడ్డూని మాయం చేయడంతో ‘మీ సంగతి అక్టోబర్ 2న చెప్తా’ అని రాజమౌళి సరదాగా నవ్వులు పూయించారు.
రాజమౌళి విషయానికి వస్తే..
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘వారణాసి’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ‘వారణాసి’ని రిలీజ్ చేయనున్నారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’
SS Rajamouli bid ₹1cr for a laddu.
Watch the funny promotional clip 🤣#DontTroubleTheTrouble pic.twitter.com/zrUld7XEHk
— Mr SP (@Lonely_prabh) September 21, 2026


