‘‘డీజే టిల్లు, ‘జాతి రత్నాలు’ చిత్రాలు ఊహించని విజయాలు సాధించాయి. అలాగే మా ‘అనుమాన పక్షి’ కూడా ఊహించని విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని రాగ్ మయూర్ చెప్పారు. రాగ్ మయూర్ హీరోగా ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో రాగ్ మయూర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరోకి అనుమానాలు ఎక్కువ.
తన అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో మొదలై, మిస్టరీ జానర్‌లోకి వెళ్లి, థ్రిల్లర్‌లా టర్న్ తీసుకుంటుంది. హారర్ టచ్‌తో పాటు సందేశం కూడా ఉంది. ఈ సినిమాలోని హీరో క్యారెక్ట రైజేషన్‌కు నేనే సూట్ అవుతానని, నన్ను నమ్మి అవకాశం కల్పించారు విమల్. ఇక నేను నటించిన ‘గరివిడి లక్ష్మి’ అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ‘అంతా భ్రాంతియేనా’ అనే సినిమా చేశాను’’ అని చెప్పారు.


