నాని ది ప్యారడైజ్ మూవీకి ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. టిక్కెట్లతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబరు 23న వేయనున్న స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.400(మల్టీప్లెక్స్‌ల్లో), రూ.300( సింగిల్ స్క్రీన్‌లో)గా నిర్ణయించారు. దీంతో పాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఒక్కో టికెట్ ధరపై మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకునేందుకు అనుమతించారు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతి లభించింది.
ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అంజనా అంజనా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ సైతం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తుండగా.. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.


