నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని సాంగ్స్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మాస్ సాంగ్స్ మాత్రమే రిలీజ్ కాగా.. తాజాగా రొమాంటిక్ పాట విడుదల చేశారు. అంజానా అంజానీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కిట్టు విస్సాప్రగత లిరిక్స్ అందించగా.. ఈ పాటను అనిరుధ్ రవిచందర్, సుబ్లాషిణి ఆలపించారు.


