నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు
ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ..'ఈ సినిమా కోసం మా టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. మా సవారీ గ్రూప్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ నెల 24న మా కష్టాన్ని మీరంతా చూస్తారు. ఈ సినిమాకు కాసర్ల శ్యామ్ సాంగ్స్ అద్భుతంగా రాశారు. శ్రీకాంత్ ఓదెల ప్రతి ఒక్కరితో పని చేయించారు. ఈ మూవీతో శ్రీకాంత్ సక్సెస్ కొట్టబోతున్నారు. సంపూ బిర్యానీ పాత్రలో ఇరగదీశారు. ఈ సినిమా సెట్‌లో సోనాలి, రాఘవ్ నా ఫేవరేట్ యాక్టర్స్. ఈ మూవీ కయాదు అద్భుతంగా చేసింది. సుబ్బు పాత్ర మీ గుండెల్లో నిలిచిపోతుంది. మోహన్‌బాబు గురించి మాకు బాగా తెలుసు. ఆయన కటౌట్ ఏంటనేది ప్యారడైజ్ మరోసారి గుర్తుచేస్తుంది. అనిరుధ్ ఈ మూవీ కోసం తన ప్రాణం పెట్టేశాడు' అని అన్నారు.
ఈనెల 23 ప్రీమియర్ షో నుంచే థియేటర్స్ ఊగిపోతాయని నాని ధీమా వ్యక్తం చేశారు. మీ నెగెటివిటీ కూడా పాజిటివ్‌గా మారిపోవాలని ఫ్యాన్స్‌కు సూచించారు. మనం ఓడిపోతే చూద్దామనుకునేవాళ్లు ఉంటారు..కానీ నేను గెలుస్తాననే నమ్మేవాళ్లకోసం నేను కష్టపడుతూనే ఉంటానని తెలిపారు. నా నమ్మకం మీద మీ అందరికీ నమ్మకముందని నాకు తెలుసని అన్నారు. సినిమా మొదలైనప్పుడే జడలకు.. మీకు ఓ లాక్ పడుతుందన్నారు. దర్శకుడు శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతాదన్నారు. చివర్లో ఈ మూవీలోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు హీరో నాని.


