దీపు లుక్‌ విడుదల | Krithi Shetty first look from January 12 Vidudala unveiled | Sakshi
Sakshi News home page

దీపు లుక్‌ విడుదల

Sep 22 2026 1:26 AM | Updated on Sep 22 2026 1:26 AM

Krithi Shetty first look from January 12 Vidudala unveiled

‘జనవరి 12 విడుదల’ సినిమా నుంచి హీరోయిన్‌ కృతీ శెట్టి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. సోమవారం (సెప్టెంబరు 21) కృతీ శెట్టి బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమాలోని దీపు పాత్రలో కృతీ శెట్టి నటిస్తున్నట్లు వెల్లడించి, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అర్చన, జీ స్టూడియోస్, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement