ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు: సూర్య–జ్యోతిక | Suriya and Jyotika renew wedding vows after 20 years of marriage | Sakshi
Sakshi News home page

ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు: సూర్య–జ్యోతిక

Sep 22 2026 1:20 AM | Updated on Sep 22 2026 1:20 AM

Suriya and Jyotika renew wedding vows after 20 years of marriage

‘‘మా మనసులోని మరో ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. మా పై మీరు కురిపించిన ప్రేమ, సానుకూలంగా స్పందించిన తీరుకి ముగ్ధులమయ్యాం’’ అంటూ స్టార్‌ కపుల్‌ సూర్య, జ్యోతిక సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. పెళ్లయి 20 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 16న ఈ ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడం, మరో 20 ఏళ్లకు పైగా ఈ ప్రేమ ప్రయాణాన్ని ఇలానే సాగించాలనుకుంటున్నామని పేర్కొనడం తెలిసిందే. ఇలా మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని చాలామంది స్వాగతించారు... ఆశీర్వదించారు. వారందరూ చూపించిన ప్రేమను, ఈ వేడుక బాగా జరగడానికి కారకులైన వారిని ఉద్దేశించి సూర్య–జ్యోతిక సోమవారం తమ మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు. 

‘‘స్కాట్‌ల్యాండ్‌లో మా వివాహ వేడుకను మరపురానిదిగా చేసిన మా బృందానికి ధన్యవాదాలు. మాకు జీవితంలో మరచిపోలేని అనుభూతిని బహుమతిగా ఇచ్చినందుకు వేడుక నిర్వాహకురాలు లిసాకు ధన్యవాదాలు. మా సీక్వెల్‌ మ్యారేజ్‌ ఆహ్వాన పత్రికను ఎప్పటికీ మా కాఫీ టేబుల్‌పై ఉంచేంత అద్భుతంగా చేసిన డారియాకి థ్యాంక్స్‌. ఇక డయానే అందించిన పువ్వుల అందాన్ని ఏ ఫొటో కూడా క్యాప్చర్‌ చేయలేదు. ఆ కోట గోడల మధ్య రాజకుటుంబీకుల్లా ఉన్నామనే అనుభూతిని బ్లెయిర్‌క్వాన్‌ కోటలోని రోజ్, ఆమె టీమ్‌ అందించారు.

వారు ఇచ్చిన ఆతిథ్యం ఎంత బాగుందంటే వీడ్కోలు చెప్పేటప్పుడు మేం కన్నీళ్లు పెట్టుకుంటామని ఊహించలేదు. మా అందమైన క్షణాలను వీడియోలో అద్భుతంగా చిత్రీకరించిన జోవాన్‌కి, అంకిత భావంతో ఫొటోలు తీసిన డెల్, జేకి థ్యాంక్స్‌. స్కాట్‌ల్యాండ్‌లోని పొగమంచుతో నిండిన పర్వత ప్రాంతాలు, సరస్సులను మా ప్రేమకు తీపి గుర్తుగా ఎంచుకున్నాం. మాకు కలిగిన అనుభూతికి మించిన గొప్పదేదో మా ఇంటికి తీసుకొచ్చాం. మాకు గొప్ప అనుభూతిని మిగిల్చిన మంచి మనసున్న వ్యక్తులను కలవడం వల్ల మా హృదయాలు ఎప్పటికీ స్కాట్‌ల్యాండ్‌ జ్ఞాపకాలకు దూరం కావు’’ అంటూ సూర్య–జ్యోతిక తమ సీక్వెల్‌ వివాహం తాలూకు అనుభూతిని పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement