బిగ్‌బాస్ సీజన్ 10లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు ఉండగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు మాటలతో యుద్ధానికి దిగారు. ముఖ్యంగా సృష్టి-సుధీర్ గొడవ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. అసలు ఇంత గొడవపడటానికి కారణం ఏంటి? నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరింగింది. చూద్దాం రండి.!
అన్నం పెట్టేవాడికే చెత్త వేయడం ఏంటి?
స్టార్ ఆఫ్ ది వీక్‌గా ముకేశ్ ఉండటంతో అతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. అయితే ముకేశ్ కారణంగా ఝాన్సీ టెన్షన్‌కు గురైందని భావిస్తే ఆమెను నామినేట్ చేయవచ్చని తెలిపారు. ఇక నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఎన్వలప్స్ ఇచ్చి.. అందులో ఎన్ని ఓట్లు ఉంటే అంతమందిని నామినేట్ చేయాలనే టాస్క్ పెట్టారు. రాంప్రసాద్, చరణ్ ముందుగా పోటీ పడగా ఇద్దరికీ ఎన్వలప్స్ వచ్చాయి. కెప్టెన్‌గా ఉన్న ఝాన్సీ.. రాంప్రసాద్‌కు నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం అతడికి వచ్చింది. రాంప్రసాద్ మొదట వంశీని నామినేట్ చేశాడు. ఫుడ్ పెట్టే సమయంలో పెద్దగా అరవడం తనకు నచ్చలేదని కారణం చెప్పాడు.
అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది. వర్షిణి ఏడ్చిన విషయాన్ని వంశీ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మానిటర్‌గా ఉన్న దేబ్జానీ కూడా ఈ విషయంలో కలగజేసుకోవడంతో వంశీ-దేబ్జానీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో రాంప్రసాద్.. ‘ఇది నా నామినేషన్’ అంటూ గట్టిగా చెప్పి వంశీపై చెత్త వేశాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. అన్నం పెట్టిన వాళ్ల మీదే చెత్త వేస్తున్నారంటూ సెటైర్ వేశాడు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.
ఇదీ చదవండి: 10వేల మందికి అదిరిపోయే ట్రీట్! నాని ఫ్యాన్స్‌కు పండగే..
సృష్టి వర్సెస్ సుధీర్.. హౌస్‌లో మరో రచ్చ
ఇక ఎపిసోడ్‌లో అసలు హీట్ సృష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవతో వచ్చింది. త్రిగుణ్ తనను మానిప్యులేట్ చేశాడని సుధీర్ ఆరోపించాడు. గతంలో జరిగిన గొడవలన్నీ క్లియర్ అయ్యాయని.. ఇక తనకు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ చెప్పడంతో సృష్టి తీవ్రంగా స్పందించింది. ‘నేను నీ వెంట పడ్డానా?’ అంటూ సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కోపంలో కొడతా, పళ్లు రాలగొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ గొడవతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ తర్వాత సృష్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
షాలినిని టార్గెట్ చేసిన వర్షిణి
ఇక మరోవైపు వర్షిణి, దేబ్జానీ మధ్య పోటీ జరిగింది. నామినేషన్ చేసే అవకాశం వర్షిణికి రావడంతో ఆమె షాలినిని టార్గెట్ చేసింది. షో కోసమో లేక ప్రోమోలో కనిపించడం కోసమో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే షాలిని వ్యవహరిస్తోందని.. ఆమెది ఫేక్ పర్సనాలిటీ అని వర్షిణి ఆరోపించింది. కేవలం కంటెంట్ కోసమే కొన్ని విషయాలు చేస్తోందని చెప్పింది. దీనిపై షాలిని కూడా గట్టిగానే స్పందించింది. వర్షిణితో వాదనకు దిగింది.
అనంతరం వర్షిణి తనకు వచ్చిన మరో నామినేషన్ అవకాశాన్ని సుధీర్‌కు ఇచ్చింది. దీంతో సుధీర్ అమన్‌ను నామినేట్ చేశాడు.
ఝాన్సీని టార్గెట్ చేసిన చరణ్
చరణ్ తన నామినేషన్‌లో ఝాన్సీని టార్గెట్ చేశాడు. ఆమె తనతో మనస్ఫూర్తిగా ఉండటం లేదని ఆరోపించాడు. తనతో మాట్లాడుతున్న సమయంలో నిద్ర వస్తోందని చెప్పి వెళ్లిపోయి.. మరో టీమ్‌తో మాత్రం సరదాగా మాట్లాడిందని చెప్పాడు. అంతేకాకుండా గేమ్‌లో ఎవరు తనకు సపోర్ట్ చేశారనే విషయాన్ని ఇతరులకు చెప్పడం కూడా తనకు నచ్చలేదని తెలిపాడు. చివరగా రైతులకు సంబంధించిన కండువా, షర్ట్‌ను నామినేషన్స్ రోజే ధరించడం కూడా తనకు నచ్చలేదని చెప్పడంతో ఝాన్సీపై చరణ్ పెట్టిన నామినేషన్ ఆసక్తికరంగా మారింది.
దేబ్జానీ నామినేషన్‌లో త్రిగుణ్
చివరగా దేబ్జానీ.. త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ఇలా ఒక్కో నామినేషన్‌తో హౌస్‌లో ఉన్న పాత గొడవలు, మనస్పర్థలు బయటకు రావడంతో 14వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా సృష్టి-సుధీర్ మధ్య జరిగిన గొడవ.. వర్షిణి-షాలిని వాగ్వాదం.. రాంప్రసాద్-వంశీ నామినేషన్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్ కయాదు జర్నీ


