నా దగ్గరకి రావడానికే భయపడతారు: మోహన్‌ బాబు | People Will Not Coming Near Me Mohan Babu On His Terrifying Villain Role As Shikanja Malik In The Paradise Movie | Sakshi
Sakshi News home page

The Paradise: ‘ప్యారడైజ్‌ చూసాక నా దగ్గరకి రాడానికే భయపడతారు’

Sep 22 2026 9:20 AM | Updated on Sep 22 2026 9:24 AM

People Will Not Coming Near Me Mohan Babu On His Terrifying Villain Role As Shikanja Malik In The Paradise Movie

నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ మరో రెండు రోజుల్లో బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిన్న( సోమవారం) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.  ఈ చిత్రంలో మోహన్‌బాబు పోషించిన విలన్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఈ నేపథ్యంలో తన పాత్రపై స్వయంగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.

నా వద్దకు రావడానికే భయపడతారు..
ఓ సందర్భంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూనే.. ‘ఈ కేరింతలు, చప్పట్లు అన్నీ ‘ప్యారడైజ్’ సినిమా కోసమేనని నాకు అర్థమవుతోంది. అయితే సెప్టెంబర్ 24న థియేటర్లలో ఆ సినిమా చూసిన తర్వాత ఎవరూ నా దరిదాపుల్లోకి కూడా రారు. నా వద్దకు రావడానికే భయపడతారు. ఎందుకంటే ఆ చిత్రంలో నా పాత్ర అంత భయంకరంగా, అత్యంత క్రూరంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన రోల్ సరికొత్త తరహాలో ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు.  ‘ది ప్యారడైజ్’ చిత్రంతో తాను చూపించబోయే భీకర విలనిజం గురించి మోహన్‌బాబు ఇచ్చిన హింట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement