టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్రం బృందం తాజాగా ఏందయ్య సామీ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇదీ చదవండి:తొలిరోజు ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. దుమ్మురేపుతున్న కలెక్షన్స్


