ఇరుముడి ప్రభంజనం.. 'ఆర్ఆర్ఆర్'పై కన్నేసినట్టేనా? | Will Irumudi Movie Beat Rajamouli RRR Movie Record viewership in OTT | Sakshi
Sakshi News home page

ఇరుముడి ప్రభంజనం.. 'ఆర్ఆర్ఆర్'పై కన్నేసినట్టేనా?

Sep 24 2026 11:45 PM | Updated on Sep 25 2026 12:06 AM

Will Irumudi Movie Beat Rajamouli RRR Movie Record viewership in OTT

మాస్‌రాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ మంచి జోరు చూపిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ వ్యూస్ సాధించింది. 11 దేశాల్లో టాప్-10లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా 5.6 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

దీంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ఇరుముడి నిలుస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. అయితే ఆ స్థాయి అంచనాలకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారం లేదనే చెప్పాలి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ సినిమాల పరంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికీ భారీ రికార్డుతో ముందుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 45 మిలియన్లకు పైగా వాచింగ్ అవర్స్ సాధించింది. ఆ తర్వాత స్థానంలో జవాన్, గంగూబాయ్, యానిమల్ వంటి చిత్రాలు ఉన్నాయి.

ఇక సౌత్ సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో విజయ్‌ సేతుపతి నటించిన మహారాజా చిత్రం నిలిచింది. కాబట్టి ఇరుముడి ప్రస్తుత ఓటీటీ జోరు ఖచ్చితంగా చెప్పుకోదగ్గదే అయినప్పటికీ, ఆర్ఆర్ఆర్ స్థాయి రికార్డును అధిగమించాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరుముడి చిత్రానికి నార్త్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి కూడా భారీ ఆదరణ రావడం విశేషం. కానీ ఇప్పుడే నంబర్-1 అంటూ తేల్చేయడం మాత్రం తొందరపాటనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇరుముడి అదే వేగాన్ని కొనసాగిస్తుందా? నార్త్, ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మరింత వ్యూయర్‌షిప్ వస్తుందా? అన్నదే కీలకమైన అంశం అని చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement