టాలీవుడ్‌లో ఇప్పుడుంతా ది ప్యారడైజ్ ఫీవర్ నడుస్తోంది. నాని హీరోగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు ఆడియన్స్ నాని నటనపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరేమో కథలో ఎమోషన్స్ పండలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా కథ, కథనం ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
ముఖ్యంగా ఏషనాగుల కట్టమీద సాంగ్ రిలీజయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల వ్యూస్‌తో పాటు రీల్స్ చేస్తూ ఆడియన్స్ ఊగిపోయారు. తాజాగా ఈ పాటకు హూక్‌స్టెప్‌తో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ఆయన సతీమణి జ్యోతిరాజ్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఈ పాటకు కొరియోగ్రఫీ ఆట సందీప్ మాస్టర్ అందించడం మరో విశేషం. వీరిద్దరు దంపతులు ఫుల్ ఎనర్జీతో ఏషనాగుల కట్టమీద పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


