‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్‌..?’ | Sampoornesh Babu Faces Tough Questions During The Paradise Movie Promotions, Wins Praise For His Calm Response | Sakshi
Sakshi News home page

సంపూర్ణేష్‌పై బాడీ షేమింగ్‌.. జర్నలిస్ట్‌పై నెటిజన్లు ఫైర్‌

Sep 24 2026 4:28 PM | Updated on Sep 24 2026 6:16 PM

Sampoornesh Babu Faces a Shocking Question During The Interview Video Goes Viral

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నటించిన పలువురు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నారు. ‘బిర్యాని’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన ఆయన.. తనదైన నటనతో మెప్పించారు.

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో.. 
అయితే ప్రస్తుతం సంపూర్ణేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబును సీనియర్ జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్‌లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.

సంపూర్ణేష్ పై ప్రశంసలు..
ఈ ప్రశ్నలకు సంపూర్ణేష్ బాబు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా ఎంతో ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, పేద కుటుంబం నుంచి వచ్చారని ఇలా ప్రశ్నించడం అవసరమా?’ అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంపూర్ణేష్ బాబు మాత్రం ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నా ఓర్పుగా ఇంటర్వ్యూను ఎదుర్కొన్న తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో రాణించేందుకు నేపథ్యం కంటే ప్రతిభ, పట్టుదల ముఖ్యమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లోనూ కొత్త తరహా పాత్రలో కనిపించారు. 

ఇదీ చదవండి: కుటుంబ బంధాలపై బిగ్‌బాస్‌ ట్విస్ట్‌.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement